మాస్క్ లేకుంటే.. కోర్టుకే
నేటి నుంచి నిబంధన కఠినతరం
అమలు చేయనున్న పోలీసు శాఖ
హైదరాబాద్: కొవిడ్-19 సెకండ్‌వేవ్ తీవ్రత నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది.
శుక్రవారం నుంచి ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టుల్లో హాజరుపరచనుంది.
ప్రభుత్వ ఆదేశాలతో.. గడిచిన నాలుగు రోజులుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేసిన పోలీసులు.. ఇక నేరుగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
విపత్తు నిర్వహణ చట్టంతోపాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు పెడతామని స్పష్టం చేస్తున్నారు.
ఈ మేరకు అన్ని కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.