విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా శాసన సభ్యుడు ప్రవర్తిస్తున్నారని పొట్టి శ్రీరాములు మత్యకారుల సేవా సంఘం మరియు ఇతర సంఘ సభ్యులు ఆరోపించారు.
వీ జే ఫ్ ప్రెస్ క్లబ్ లో కోటవీధి , ఫెర్రీ రోడ్డులో జీవిస్తన్న మాజీ కార్పొరేటర్ కదిరి అప్పారావు మాట్లాడుతూ, సుమారుగా గత 70 సంవత్సరాలుగా తాము కోట వీధిలో నివాసపరులై ఉన్నామని అన్నారు.
తమతో పాటుగా ఆ ప్రాంతంలో ఇతరితర కులాల వారు మతాల వారు కూడా ఉంటున్నారని ఇంతవరకూ తమ మధ్య ఎన్నడూ కుల విభేదాలు లేవనీ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న శాసన సభ్యుడు కుల భేదాలు చూపిస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు.
అనంతరం పొట్టిశ్రీరాముల మత్య కారుల సేవా సంఘం జనరల్ సెక్రటరీ కే.యం.కీర్తన్ మాట్లాడుతూ పూర్వం నుంచి హిందూ ముస్లిం అనే కుల మత భేదాలు లేకుండా తామందరం జీవిస్తున్నామని తెలిపారు.
తమ కుల పెద్దలు గతంలో ప్రభుత్వానికి కోరగా సామాజిక అవుసరాల కోసం కళ్యాణ మండపం, పార్కులను ఏర్పాటు చేసారనీ ఇంతవరకు ఆ కళ్యన మండపాన్ని పార్కును కులాలకు అతీతంగా వినియోగించుకుంటున్నామని ఆ కల్యాణ మండపానికి పొట్టి శ్రీరాములు అనేనామకరణం చేసామని అది రికార్డ్‌లో నమోదు అయ్యి ఉంది అని అన్నారు.
ఇది ఇలా ఉండగా ముస్లిం సోదరులుకు ఆ ప్రక్కనే కొద్దికాలానికి షాధీఖానా పేరుతో ఒక భవంతిని నిర్మించి ఇచ్చారు అని అన్నారు.
కొంతమంది దురాశ పరులు కళ్యన మండపాన్ని పార్క్‌ను స్వాధీన పరుచుకోవడానికి చూస్తున్నారని దీనికి మద్దతుగా నేడు శాసనసభ సభ్యుడు వంత పలుకుతున్నారని అన్నారు.
కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన పార్కును కళ్యాణ మండపాన్ని యథావిధిగా ఉండేవిధంగా అందరూ వినియోగ పర్చుకునే విధంగా చూడాలని, కులాల పేరిట మతాల పేరిట ఎటువంటి తగాదాలకు పాలు పడకుండా చూసే భాద్యత శాసన సభ్యులకు ఉంది అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో బాల కనక దుర్గ మత్యకారుల సంఘం బంగారి, వాడ బలిజి కుల పెద్ద రాజారావు, మెంబర్ పెంటయ్య తదితరులు ఉన్నారు.