శ్రీరామనవమి వేడుకలు ఇళ్లలోనే జరుపుకుని శ్రీరామ రక్షలొనే ఉన్నారని ఆశిస్తున్నాము
శ్రికాకుళం జిల్లా పలాస నియోజికవర్గం శాసన సభ్యులు శ్రీ డా. సీదిరి అప్పలరాజు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేసారు.
ఈ సందర్భంగా రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు ప్రజలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా శ్రీరామ నవమి వేడుకలు మీ ఇళ్లలోనే జరుపుకుని శ్రీరామ రక్ష లొనే ఉన్నారని ఆశిస్తున్నట్లు ఆయన ఆశించారు.
కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక దినాన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గ్రామాలలోని ప్రతి సచివాలయ పరిధిలో మరియు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కోవిడ్ టెస్ట్ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయని తెలియజేసారు.
జ్వరం, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి ఎలాంటి లక్షణాలు ఉన్న సరే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ వలంటీర్‌ను సంప్రదించి కోవిడ్ టెస్ట్ చేయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేసారు.
కోవిడ్ పొజిటివ్ వస్తున్నవారి మరణ శాతం అధికమవుతున్న కారణంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందిగా కోరారు.
ముందస్తుగా హాస్పిటల్లో చేరడం (Early Hospitalisation) ద్వారా మరణాల శాతాన్ని (Mortality Rate) నియంత్రించవచ్చు అన్న విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరారు.
కోవిడ్ కు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమాచారం కావాలన్న కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్: 104 కు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చునని తెలిపారు.
అలాగే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు హాస్పిటల్ లేదా క్వారంటైన్ కు వెళ్లదలచిన వారు ఆయా మండలాల కోవిడ్ ఆఫీసర్లు అయిన తహశీల్దార్లను సంప్రదించాలని తెలిపారు.
తహశీల్దార్ల ఫోన్ నెంబర్లు:
తహశీల్దార్ మందస 8333988792
తహశీల్దార్ వజ్రపుకొత్తూరు 8333988793
తహశీల్దార్ పలాస 8333988794.
కోవిడ్ కు సంబందించి పూర్తిస్థాయి వివరాల కొరకు టెక్కలి డివిజన్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ మరియు డిప్యూటీ జిల్లా వైద్యాధికారి శ్రీమతి డా. లీలా గారికి 9490642059 నెంబర్ కు కాల్ చేయవలసిందిగా తెలిపారు.
అత్యవసర సమయంలో లాంటి సహకారం కావాలన్నా మంత్రివర్యుల వారి వ్యక్తిగత సహాయకులను సంప్రదించవచ్చునని తెలిపారు.
వారి నెంబర్లు: 9395523455, 9396623466.
మరీ అత్యవసరమైతే మంత్రివర్యులు వారి పర్సనల్ గ్రీవేన్స్ నెంబర్ 9494222020 నెంబర్ కు మేసేజ్ లేదా కాల్ చేయవలసిందిగా కోరారు.
ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించి, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేసారు.