కోవిడ్ కేంద్రాల్లో పౌష్టికాహారం ప్రాధాన్యం
శ్రీకాకుళం, మే 8 : కోవిడ్ కేంద్రాల్లో పౌష్టికాహార కల్పనకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతోంది. కోవిడ్ బాధితులకు ముఖ్యంగా మందుల కంటే సరైన ఆహారం తీసుకుంటే కరోనా పారిపోతుంది అని నిరూపించడం జరుగుతోంది.
కరోనాతో బాధపడే వ్యక్తులకు పరిస్థితికి అనుగుణంగా కోవిడ్ కేర్ కేంద్రాల్లో, కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించడం జరుగుతోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పౌష్టికాహార కల్పనపై దృష్టి సారించింది.
పాజిటివ్ అని తేలిన వ్యక్తులకు హోం ఐసోలేషన్ అవకాశం లేని పక్షంలో కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించడం జరుగుతోంది.
కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం అన్ని సౌకర్యాలను ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగింది. కోవిడ్ కేంద్రాల్లో మంచి వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు 24 గంటలు పర్యవేక్షణ చేసే వైద్య బృందాలు, అవసరమైన మందుల పంపిణీ జరుగుతోంది.
చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా కోవిడ్ బాధితులకు మానసిక ధైర్యం కల్పించడం జరుగుతోంది.
మానసికంగా బలం పుంజుకున్నప్పుడు, నమ్మకం కలిగి నప్పుడు కోవిడ్‌ను సులభంగా ఓడించవచ్చును. ఈ ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ జె నివాస్ కోవిడ్ బాధితులకు అవసరమగు మంచి వసతి సౌకర్యాలు కల్పించాలని, పౌష్టిక ఆహారాన్ని అందించాలని, మానసిక వికాసానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని, కేంద్రాలు పరిశుభ్రతకు మారుపేరుగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి వీ.రవి కుమార్, మండల పరిషత్ అధికారులు, తహశీల్దార్లు కోవిడ్ కేర్ కేంద్రాల నోడల్ అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతోంది.
పాత్రునివలస కోవిడ్ కేర్ కేంద్రం నోడల్ అధికారి జి.రవి కుమార్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రంలో పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలని అందుకు అనుగుణంగా ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉదయాన్నే బెల్లం, వేరుశనగలు కలిపిన రాగి జావ, అల్పాహారంగా రెండు ఇడ్లిలు, ఒక వడ లేదా మరో రకం, రెండు చట్నీలు, టి, వాటర్ బాటిల్.
మధ్యాహ్నం భోజనంగా వేడి అన్నం, చపాతి, చికెన్, క్యారెట్ మిక్స్ కర్రీ, సాంబార్, రసం, పెరుగు, అరటిపండు, పచ్చడి, వాటర్ బాటిల్ అందిస్తున్నామని ఆయన చెప్పారు.
సాయంత్రం స్నాక్స్ గా ఒక బిస్కెట్ ప్యాకెట్, టి అందిస్తున్నామని రవి కుమార్ తెలిపారు. రాత్రి భోజనంలో వేడి అన్నం, చపాతీ, కాయగూరల కూరలు రెండు, ఒక గుడ్డు, సాంబార్, పెరుగు, టమాటా పచ్చడి, వాటర్ బాటిల్ అందిస్తున్నట్లు చెప్పారు.
తమ కోవిడ్ కేంద్రంలో రెండు వేల పడకలు ఉండగా, 826 మంది ఉన్నారని తెలిపారు. శనివారం 81 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు.
ప్రతి రోజు ఎక్కువ సంఖ్యలో డిశ్చార్జ్ కావడం సంతోసాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.