మరచిపోయి చేసిందో.. కావాలనే చేసిందో తెలియదు కానీ.. బీహార్‌లోని ఓ నర్సు చేసిన పని వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అపహాస్యం పాలు చేసింది.
వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన వ్యక్తికి ఆమె ఖాళీ సిరంజీనే గుచ్చి పంపించేసింది.
అయితే దానిని అతని స్నేహితుడు వీడియో తీయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆమె ఉద్యోగం పోయింది.
బీహార్‌లోని చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
ప్లాస్టిక్ కవర్ నుంచి కొత్త సిరంజీ తీసిన నర్సు.. నేరుగా వ్యక్తి భుజంలోకి గుచ్చింది. అనంతరం వ్యాక్సిన్ వేసినట్టు చెప్పి పంపేసింది.
అయితే ఆ ప్రక్రియను అతని స్నేహితుడు మొబైల్ ఫోన్లో షూట్ చేయడంతో ఆమె దొరికిపోయింది.
ఫ్రెండ్ తీసిన వీడియో చూసిన తర్వాతే తనకు ఖాళీ సిరంజీ గుచ్చినట్టు గుర్తించానని ఆ వ్యక్తి చెప్పాడు.
టీకా తీసుకునేటప్పుడు అతడి రియాక్షన్ ఎలా ఉంటుందో రికార్డు చేయాలనే ఉద్దేశంతోనే అతని స్నేహితుడు వీడియో తీశాడు.
`ఆ వీడియోను మళ్లీ రెండోసారి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ప్లాస్టిక్ కవర్ నుంచి నేరుగా ఆ నర్సు సిరంజీ తీసి నా ఫ్రెండ్‌కు ఇచ్చినట్టు గుర్తించానని ఆ వీడియో తీసిన వ్యక్తి చెప్పాడు.