ఘనంగా ఎన్ టి రామారావు జయంతి వేడుకలు..

మండపేట: స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి వేడుకలను శుక్రవారం మండపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు అధ్యక్షతన ఘణంగా నిర్వహించారు.
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
ముందుగా ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్ధానిక కరాచి సెంటర్ వద్ద ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అందరికీ మిఠాయిలు పంచారు.
ఈ కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు,
3వ వార్డు కౌన్సిలర్ యరమాటి గంగరాజు, 4వ వార్డు కౌన్సిలర్ గుండు రామతులసి, వీర తాతరాజు, 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశి విశ్వనాధం, 9వ వార్డు కౌన్సిలర్ చుండ్రు వీరవెంకట సుబ్బారావు చౌదరి, 10వ వార్డు కౌన్సిలర్ శిరంగు జ్యోతి ఈశ్వరరావు,
17వ వార్డు కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవాని శ్రీనివాస్, 21వ వార్డు కౌన్సిలర్ చింతలపూడి దుర్గ సత్తిబాబు,
అమలాపురం పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బండి గోవిందు, అమలాపురం పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం, పాలచర్ల లక్ష్మణరావు, షేక్ వల్లీ జాని, తదితరులు పాల్గొన్నారు.
అర్తమూరు లో ఘనంగా ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు..

మండపేట మండలం అర్తమూరు గ్రామంలో నందమూరి తారకరామారావు 98వ జయంతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముందుగా దుర్గమ్మ గుడి వద్ద వున్న ఎన్టీఆర్ విగ్రహానికి, పెద్దనూతి సెంటర్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యకర్తలకు, గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వ విద్యాలయం మాజీ పాలకవర్గ సభ్యులు పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమని అన్నారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్నగారు ఎంతో కృషి చేశారని అన్నారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి మాట్లాడుతూ కోస్తా రైతులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఒక వరమని, ఆయన వల్లే మనం ఈ రోజున రెండవ పంట(దాళ్వా) పండించుకోగలుగుతున్నామని రైతులు అందరూ ఆయనకు ఋణపడి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పడాల రామకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ జంబయ్య, శ్రీను, రామన్న కాపు, శేషారెడ్డి, చిర్ల బాబుల్, తేతల వెంకట రెడ్డి, చిర్ల చందు, బొజ్జి రెడ్డి, చిర్ల వాసు, వెలగల రామా రెడ్డి, రామకృష్ణా రెడ్డి, చిర్ల వీరబాబు, కర్రి హరిబాబు, కర్రి చిన్న హరిబాబు, డి వీర్రాఘవ రెడ్డి, తాడి సత్తి రెడ్డి, కొవ్వూరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.