నామినేషన్ల స్క్రూటినీ పక్కడ్బందీగా నిర్వహించాలి; రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్ చోగ్తో
అర్బన్ కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ పమేలా సత్పతి తో కలసి నామినేషన్, పోలింగ్ కేంద్రాల పరిశీలన
నామినేషన్ల స్క్రూటినీ పక్కడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు, డాక్టర్ క్రిస్టినా జెడ్ చోగ్తో ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా జిడబ్ల్యూఎంసి ఎన్నికలకు సాధారణ ఎన్నికల పరిశీలకురాలుగా నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోగ్తో సోమవారం అర్బన్ కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు, జిడబ్ల్యూ ఎంసి కమిషనర్ పమేలా సత్పతి తో కలసి వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్, ఎల్ బి కళాశాల నామినేషన్ కేంద్రాలలో రిటర్నింగ్ అధికారులు నిర్వహిస్తున్న స్క్రూటినీ తీరును పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు స్క్రూటినీ చేయాలని అన్నారు.
అనంతరం నగరంలోని వరంగల్ పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.
ప్రతి కేంద్రంలో ఓటర్లకు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకొనుటకు అవసరమయ్యే ఏర్పాట్లు అన్ని చేయాలని అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిడబ్ల్యూఎంసి పరిధిలో 66 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా 878 పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులతో పాటు ర్యాంపులు, దివ్యాంగులకు వీల్ చైర్లు, వాలంటీర్లు ఏర్పాటు, వేసవి దృష్ట్యా షామియానాలు, త్రాగునీటి సౌకర్యం మొదలగునవి వసతులు కల్పించడం జరిగింసన్నారు.
ఎన్నికలు శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగే విదంగా ఆన్నీ చర్యలు చేపడుతున్నామని వివరించారు.
వీరి వెంట బల్దియా, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.