రాష్ట్రంలో కరోనా కలవరం.. కొత్తగా 9,716 కేసులు, 38 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న మరో 3,359 మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం 60,208 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
24 గంటల్లో 3,359 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనాతో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8 మంది మృతి చెందారు.
చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు.
అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు.
కరోనాతో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
గుంటూరు, విశాఖ, విజయనగరం, తూ.గో. జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.