తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల నేపధ్యంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు జిల్లా లో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజక వర్గాల లో నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ రోజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈసందర్భంగా నాయుడు పేటలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు రావడం ఇష్టం లేకనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్వారంటాయిన్ కు వెళ్లారని వారు అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని ఓడించేందుకు గ్లాసుగుర్తుకు ఓట్లు వేయాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.
ఆ తరువాత గూడూరులో నవతరం పార్టీ కార్యదర్శి బత్తుల అనిల్ తో కలసి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజుగ్లాసు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన గ్లాసుగుర్తు తమకు కేటాయించిన విషయం గుర్తుంచుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడే తమను గెలిపించాలని కోరారు.
ప్రచారంలో భాగంగా వెంకటగిరిలోని రాజా గారి కోట సెంటర్ లో ప్రసంగించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన గ్లాసుగుర్తు తమకు కేటాయించిన విషయం గుర్తుంచుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడే తమను గెలిపించాలని వారు కోరారు.