విశాఖపట్నం:- సరస్వతీ పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్.
ఇసుక అందుబాటులో లేకపోవడం, ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు పెరగడంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయీన భవన నిర్మాణ కార్మికులు.
విపరీతంగా ఫైన్లు వేసి వేధిస్తున్నారని, డీజిల్, గ్యాస్ ధర పెరగడం వలన ఇబ్బంది పడుతున్నాం అంటూ తమ బాధను వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు
రెండేళ్లు అవుతున్నా ఇసుక అందుబాటులోకి తీసుకురాలేని అసమర్థ ప్రభుత్వం అని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు.
ఇసుక,సిమెంట్,స్టీల్ ధరలు పెరగడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇసుక లో భారీగా అవినీతి జరుగుతుందనీ లోకేష్ ధ్వజమెత్తారు.
ఆటో డ్రైవర్ల బాధలు వర్ణనాతీతం అని, 10 వేలు ఇస్తాం అన్నారు కనీసం 20 శాతం ఆటో డ్రైవర్లకి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
అడ్డమైన కారణాలు చెప్పి ఏడాదికి 20 నుండి 30 వేలు ఫైన్లు వేస్తున్నారని వాపోయారు.
డీజిల్, గ్యాస్ ధర పెరిగి ఆటో డ్రైవర్ల పై భారం పడింది. ఆటో స్టాండ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గెలిస్తే అన్న క్యాంటీన్లు తెరుస్తామని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు.
త్రాగునీరు, టాయిలెట్ సదుపాయం ఉన్న పర్మినెంట్ ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు.