ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ
పలు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.
ఎండలతో అల్లాడుతున్న ప్రజకలు ఈ వర్షాలతో కొంత ఉపశమనం కలిగిస్తోంది. కాగా.. కొన్ని రోజుల ఉపరితల ఆవర్తనంతో నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో పలుచోట్ల పంటలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనను విడుదల చేసింది.
శనివారం, ఆదివారం వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
దక్షిణ కోస్తా ఆంధ్రాలో శనివారం, ఆదివారం ఉరుములు , మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో.. కూడా శనివారం, ఆదివారం ఉరుములు , మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాంకుండా పలుచోట్ల పిడుగులు పడే సూచనలు కూడా ఉన్నాయని తెలిపింది.