డిజిటల్ మహానాడు లో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు..
మండపేట: టీడీపీ నిర్వహించిన డిజిటల్ మహానాడులో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరరావు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతీయేటా నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ప్రతినిధుల మహాసభను ఈ సంవత్సరం కోవిడ్ దృష్ట్యా డిజిటల్ మాధ్యమంలో చేపట్టారు.
తొలిరోజు గురువారం జరిగిన డిజిటల్ మహానాడులో మండపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ వెబినార్ ప్రత్యక్ష ప్రసారంలో ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.
జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.