ఈ రోజు భూపాలపల్లి MLA క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గత కొంత కాలంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ, రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి బండారి కవిత వారి భర్త దేవేందర్ మరియు మండలంలోని ఇతర గ్రామల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఈ నెల 4వ తారీఖున భూపాలపల్లి MLA క్యాంపు కార్యాలయంలో తనను కలవడం జరిగిందని తలెయజేసారు.
ఆ సమయంలో వారితో దాదాపు గంట సేపు ప్రజా సమస్యలపై చర్చించినట్లు ఆయన తెలియజేసారు.
అంతే తప్ప రూపిరెడ్డి పల్లి సర్పంచ్ మరియు ఆమె భర్త దేవేందర్ ఆరోపిస్తున్న విధంగా ఎటువంటి అనుచిత వాఖ్యలు చేయలేదని స్పష్టం చేసారు.
వారు తన చేస్తున్న అనుచిత వాక్యలను ఖండిస్తున్నట్లుగా మరియు ఇలాంటి వాక్యాలు చేస్తే సహించేది లేదంటూ ఈ సందర్భంగా గండ్ర పేర్కొన్నారు.
ఆయన రాజకీయ ఎదుగుదలను తనకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు తనపై చేస్తున్న కుట్రలుగా ఈ ఆరోపణలను ఆయన వర్ణించారు.
యూట్యూబ్ లో ఛానల్ నడుపుతున్న తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కేవలం ఏక పక్షంగా ఒకరి అభిప్రాయం మాత్రమే పరిగణలోకి తీసుకుని, కనీస జ్ఞానం లేకుండా తన అభిప్రాయం తీసుకోకుండా వ్యక్తిగత ఫోన్ నెంబర్ యూట్యూబ్ లో పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరడం హేయమైన చర్య గా ఆయన పేర్కొన్నారు.
తాను ఎవరిని ఏమి అనలేదని, తన నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా రాజకీయ అవకాశం కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
తన చుట్టూ ఉన్న వారు, తనను నమ్మి ఓటువేసిన ప్రతి ఒక్కరు అన్ని వర్గాలకు చెందిన వారు అని అన్నారు.
ఆ భగవంతుని సాక్షిగా తాను ఎవరిని కించపరిచే వాక్యాలు చేయలేదు, కాబట్టి నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
అదే విధముగా తమపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని వారిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గండ్ర వెంకటరామి రెడ్డితో పాటు, ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, PACS చైర్మన్, కౌన్సిలర్ లు మరియు ప్రజా ప్రతినిధులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.