ఇంజక్షన్‌తో ఉపయోగం లేదు.. ఆల్కహాల్ సర్వరోగ నివారిణి..
దేశరాజధాని ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవాళ్టి రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో వైన్ షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. లిక్కర్ బాటిల్స్ పెద్ద ఎత్తున కొనుక్కుంటున్నారు.
ఈ సందర్భంగా శివపురి గీతా కాలనీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
లిక్కర్ కొంటున్న వారిలో ఓ మహిళ ఉండటంతో.. ఆమెను మీడియా కదిలించింది.
ఆమె చెప్పిన మాటలు విని అక్కడున్న వారు షాక్ అయ్యారు.
‘‘ఇంజక్షన్‌తో ఉపయోగం లేదు.. ఆల్కహాల్ సర్వరోగ నివారిణి.. 35 ఏళ్ల నుంచి తాగుతున్నా.. ఈ ఇంగ్లీష్ మందులతో ఏం కాదమ్మా… ఒక్క పెగ్‌తో అన్నీ మాయం’’ అన్న ఆమెను చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు.