ఆదివారం మాంసాహార దుకాణాలు బంద్.. కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్..
మండపేట: మండపేట పట్టణ పరిధిలో కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం అన్ని రకాల మాంసాహార దుకాణాలు మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుసమార్ ఆదేశాలు జారీచేశారు.
చికెన్, మటన్, చేపలు, రొయ్యల వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులకు సహకరించాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.