చత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు
చత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఘోటీయా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు.
ఇరువర్గాల మధ్య సుమారు 15 నిమిషాలు భీకర పోరు జరిగింది.
ఈ క్రమంలోనే మావోయిస్టులు మూడు ఐఈడీలు పేల్చి అక్కడి నుంచి పారిపోయారు.
కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని గాలింపులు చేపట్టారు.
ఈ క్రమంలో ఘటనా స్థలంలో మందుపాతర, ఆయుధాలు, వస్తు సామగ్రి, విప్లవ సాహిత్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.