రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం..
టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి..
తప్పుడు విధానాలతో విధార్ధుల భవిష్యత్ అంధకారం..
–ఎమ్మెల్యే వేగుళ్ళ..
మండపేట: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుందని, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కరోన బారిన పడుచున్నారని ఇటువంటి పరిస్ధితులలో విధ్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు
చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కరోన ఉధృతి దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చెయ్యాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు.
పరీక్షల సంగతి దేవుడెరుగు అసలు వారి జీవితాలే ఒక పరీక్షలా మారిందని ఎమ్మెల్యే అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకుని విద్యార్ధులు, తల్లిదండ్రుల కోరిక మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండపేట మండల టిడిపి అధ్యక్షులు యరగతపు బాబ్జి, అడబాల బుల్లబ్బు, చేకూరి రమేష్ రాజు, తొర్లపాటి లాజర్, తానింకి చంద్రశేఖర్, వర్రే వీరబాబు, పల్ల బాబు, నల్లి కోటయ్య, నీలం శ్రీనివాసరావు, తదితర్లు పాల్గొన్నారు.