మహబూబాబాద్ జిల్లా… డోర్నకల్ మండలంలోని బొడ్రాయితండాకు చెందిన మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు.
ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండాలో వెలుగుచూసింది.
తండాకు చెందిన బాలిక మిర్చి కళ్ళం వద్దకు వెళ్ళి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన తేజవత్ గోబాల్ ( 48) ఇంటి ముందుకు రాగానే బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళాడు.
లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకుని బయటపడింది.
ఈ విషయం సీసీ కెమెరాలో రికార్డ్ కావటంతో, బాలిక కేకలు పెడుతూ ఏడుస్తూ బయటికొస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు కామాంధుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు, అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
ఈ మేరకు నిందితుడిపై పొక్సో చట్టం మరియు IPC చట్టాల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.