కాటిపల్లి వేంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే జాగరణ మహోత్సవము పట్టణంలోని JPN విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది.
రాత్రి 8 గంటలకు పూజా కార్యక్రమంతో జాగరణ ప్రారంభం అయింది. మానస సరోవరం నిర్మాణం చేసి శివుడి విగ్రహంతో పాటు లింగోద్భవ కార్యక్రమం కోసం లింగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ ప్రచారక్ రాజారెడ్డి గారు మాట్లాడుతూ హిందూ మతంలో ప్రతి పండగ మన జీవన విధానానికి అద్దం పడుతుందని కానీ ప్రస్తుత కాలంలో భారతీయ సంస్కృతిపై అనేక రకాల దాడులు జరిగుతున్నాయని, భారతీయ కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థే హిందూ సంప్రదాయానికి మూలస్థంబము అని అన్నారు.
కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం భక్తి శ్రద్ధలతో జాగరణ చేయాలనే ఉద్దేశంతో కాళాబృందంచే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
కారక్రమానికి విచ్చేసిన భక్తులందరికి, కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.