అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం దూసుకొస్తున్న ‘తౌక్టే’
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం
16 నాటికి తుపాన్‌గా రూపాంతరం
ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం
గుజరాత్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం
రాష్ట్రంపై ప్రభావం ఉండదన్న వాతావరణ నిపుణులు
రాయలసీమకు మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు
రుతు పవనాల రాకకు శుభ సంకేతమని వెల్లడి
విశాఖపట్నం: ఆఫ్రికా ఖండం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది.
ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ తుపాన్‌కు మయన్మార్ సూచించిన ‘తౌక్టే’ పేరుని పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది 18వ తేదీ నాటికి గుజరాత్‌కు చేరుకుంటుందని, అయితే ఎక్కడ తీరం దాటుతుందనే అంచనా చిక్కడం లేదని చెబుతున్నారు.