మండపేటలో ప్రారంభమైన లాక్ డౌన్.. ప్రజల సహకారం అవసరం.. పట్టణ సిఐ అడపా నాగమురళి..
మండపేట: కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మండపేట పట్టణ సీఐ అడపా నాగమురళి పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వైరస్ ఉధృతి కొనసాగుతోందని, దీంతో ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తోందని కరోనా కట్టడి చేసేందుకు విధిస్తున్న లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు.
ఉదయం 6 గంటలనుండి 144 సెక్షన్, మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ అమలు చేయడం జరుగుతుందని ప్రజలందరూ అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని అన్నారు.
ప్రజలు అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
