రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయని, ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర యానాంలోని పలు చోట్ల రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం నేడు తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్రాలో మూడు రోజులు పధ్రానంగా పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
రాయలసీమలో రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో ఒకటిలేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.