వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అద్భుత విజయం సాధించి, నేడు తెలంగాణ శాసన మండలికి వచ్చారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కేటీఆర్ గారు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి గారు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి శాసన మండలి ఆవరణలో శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించి, అభినందించారు.