బీజేపీలోకి మాజీ ఎంపీ?
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయు.
ఇవాళో రేపో ఆయన కషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
పార్టీ మారుతున్న విషయాన్ని తన అనుచరులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలనే ఇంతకాలం పార్టీ మారలేదని ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేసారు.
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నూతన ఇన్చార్జిగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చేన్నగారి లక్ష్మారెడ్డి(KLR) నియమితులయ్యారు.