వాల్తేరు డివిజన్ రద్దు సరికాదు.
కేంద్రం పై ఒత్తిడి తేవడంలో వైసీపీ ఎంపీలు ఘోరంగా విఫలం.
జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం..
వాల్తేరు డివిజన్ను రద్దు చేసి రాయగడ కేంద్రంగా కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం అన్నారు.
రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా డివిజన్, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ అమ్మకాలు తదితర అంశాలపై రాష్టానికి చెందిన అధికార వైసీపీ కి చెందిన 22 మంది ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావడంలో ఘోరంగా విఫలం చెందారని కొణతాల సీతారాం విమర్శించారు.
సోమవారం స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అనేక పోరాటాలు జరిగాయని, ఎన్నికల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి చెతులు దులుపుకుందని విమర్శించారు.
ఏడాదికి సుమారు 7వేల కోట్ల ఆదాయాన్ని సమకుర్చే వాల్తేరు డివిజన్ని మరిచిపోవలని, రైల్వే మంత్రి ప్రకటించడం మన ప్రాంతానికి చేస్తున్న తీవ్ర అన్యాయంగా సీతారాం పేర్కొన్నారు.
జోన్ కార్యకలాపాల నిమిత్తం కేంద్రం నిర్ణయించిన ఓఎస్డీ 175 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కేంద్రానికి సిఫార్సు చేస్తే కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించారని విమర్శించారు.
రాష్ట్రం పట్ల కేంద్ర నిర్లక్ష వైఖరి కొనసాగుతూనే ఉన్నాయని వెనుక బడిన ఉత్తరాంధ్ర మరింత వెనుక బడే ప్రమాదం ఏర్పడింది అని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసుల భయంతో ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి భయపడి ప్రశ్నించలేక, నిలదీయలేక రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండదని అన్నారు.
రైల్వే జోన్ తో పాటు వాల్తేరు డివిజన్ సాధన కోసం జై అనకాపల్లి సేన పోరాడుతుందని సీతారాం స్పష్టం చేసారు.