వైఎస్సార్ సిపి లో కంచర్ల జిల్లా…
వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో చేరిక..
మండపేట:- ఆర్యవైశ్య మహాసభ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల మాణిక్యాలరావు (జిల్లా) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మండపేట నియోజకవర్గ వైస్సార్ సిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులుకు అత్యంత సన్నిహితులు కావడంతో ఆయనచొరవ తో వైస్సార్ సిపి లో చేరారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న ఈయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ స్తబ్దత వహించారు.
ఈనెల 10న జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీలోకి రావాలని కొందరు నాయకులు పట్టుబట్టడంతో బుధవారం వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సమక్షంలో జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులతో కలిసి వైఎస్సార్ కండువా కప్పుకున్నారు.
జిల్లా మొదట్లో కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. అప్పట్లో మాజీ మంత్రి తోట నరసింహంతో సత్సంబంధాలు ఉండేవి. నరసింహం శిష్యునిగా జిల్లాకు పేరుంది.
2014 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి పని చేశారు. మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ కు మిత్రుడు కావడంతో ఆయన పట్టు వల్ల అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రకాష్ విజయానికి కృషి చేశారు.
సేవా కార్యక్రమాల్లో ముందుండే జిల్లా ఆర్యవైశ్య సంఘం ద్వారా పట్టణంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు. బిల్డింగ్ మెటీరియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.