జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘జెర్సీ’
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది.
జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు.
అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు.
ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ నిర్మాణ సంస్థ కేటగిరిల్లో ‘మహర్షి’, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు అవార్డులు
జెర్సీ, మహర్షిలకు అవార్డుల పంట
🟣ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
🟣ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
🟣ఉత్తమ వినోదాత్మక చిత్రం- (మహర్షి)
🟣ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
67వ జాతీయ చలన చిత్ర అవార్డులు
🟣ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే)
🟣ఉత్తమ నటి: కంగనా రనౌత్(మణికర్ణిక/పంగా)
🟣ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్(బహత్తార్ హూరైన్)
🟣ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)
🟣ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)
🟣ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే
🟣ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
🟣ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్
🟣ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం(మహర్షి)
🟣ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
🟣ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం)
🟣ఉత్తమ సంగీత దర్శకుడు(పాటలు): డి.ఇమ్మాన్ (విశ్వాసం)
🟣ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య): జ్యేష్టపుత్రో
🟣ఉత్తమ మేకప్: రంజిత్(హెలెన్)
🟣ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్ (కేసరి-తేరీ మిట్టీ)
🟣ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)