తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మేక వీరబాబు డిమాండ్ చేశారు.
రామవరం గ్రామం లోని పురుషోత్తమ పట్నం ఫేజ్.2 పైపులైను సమీపంలో ఉన్న 109, 107 సర్వే నెంబర్ల భూమిలో సుద్ధపడటంతో అక్రమార్కులు ఆ భూమి పై కన్ను వేశారు.
ఆ సర్వే నెంబర్ భూమి లో ఉన్న సుద్ద బాగా విలువైనది కావడంతో స్థానిక ప్రైవేటు కంపెనీలకు చెందిన వారు అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు.
ఒక సంవత్సర కాలంగా త్రవ్వకాలు చేస్తూ పైపులైను వెంబడి భారీ వాహనాలతో సుద్ద తరలిస్తున్నారు.
ఈ సంఘటనపై రామవరం గ్రామ రైతులు భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుకుని అక్కడ పనులను నిలుపుదల చేశారు.
ఈ సంఘటనపై భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ వీరబాబు స్థానిక తహశీల్దార్ సరస్వతికి ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమె సంఘటన స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ మైనింగ్ చేపట్టిన వారిపై నోటీసులు ఇస్తామన్నారు.
ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ఒక ప్రవేట్ కంపెనీ చెందినవారు ఇక్కడ సుద్దను త్రవ్వుకుని పోతున్నారాన్నారు.
ఈ పైపు లైను పైనుండి రైతులు ఏదైన వ్యవసాయ సరుకులను తీసుకువెడుతుంటే మేఘ కంపెనీలు వారు నిలుపుదల చేస్తున్నారని, అటువంటిది పైపులైను, పోలవరం కాలువపై నుండి బ్రిడ్జి మీదుగా సుద్ద లోడుతో భారీ వాహనాలు వెడుతున్న ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరుపున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రక్క రైతు కరణం బుచ్చి రామయ్య మాట్లాడుతు మాకు తెలియకుండానే మాపోలం ప్రక్కన పెద్ద, పెద్ద గుంటలు పెట్టి ఆ మట్టిని తమ పొలంలోకి తోసేశారన్నారు. మాపొలంలో కి మట్టి తోచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.