మండపేట: తాను పొరుగూరు నుంచి వచ్చి రాజకీయాలు చేయడం లేదని స్థానికున్నేనని నా ప్రజలకు ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు అని ఒకరి నుండి నేర్చుకోవాల్సిన పని లేదని మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.టిడ్కో గృహ సముదాయంపై ఆయన ఘాటుగా స్పందించారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజులకే కౌన్సిల్ ను రద్దు చేశారని, ఆ విషయం తెలుసుకోకుండా తోట త్రిమూర్తులు ఆరు నెలల పాటు కౌన్సిల్ ను నిర్వహించామని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.
అవగాహన చేసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. గురువారం జరిగిన సభలో వాలంటీర్లను, యానిమేటర్లను ఉపయోగించుకుని అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.
మండపేట పురపాలక సంఘం రాష్ట్రంలో అత్యుత్తమ నెంబర్ వన్ పురపాలక సంఘం గాను, దక్షిణభారతదేశంలో ఆరవ పురపాలక సంఘంగాను ఎన్నో అవార్డులు సాధించిందని ఆయన వివరించారు.
అది తెలుసుకోకుండా తోట త్రిమూర్తులు అవాకులు చవాకులు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు.
ఆయన హయాంలో రామచంద్రపురం పురపాలక సంఘానికి ఎన్ని అవార్డులు వచ్చాయో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.
అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరగనట్లు ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
టిడ్కో గృహ సముదాయాలు పురపాలక సంఘం పరిధిలో నిర్మిస్తున్నానని వాటిపై పురపాలక సంఘానికి పెత్తనం ఉంటుందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలోనే టిడ్కో గృహాలకు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకుని పాలు పొంగించుకున్నారన్నారు.
తాను ఒక గృహాన్ని నిర్మించుకుని ముందుగా శుభముహూర్తాన పాలు పొంగించికున్నానని అనంతరం గృహంలో ఇతర చిన్న చిన్న నిర్మాణాలు చేసుకున్నానని. అదే రీతిలో గృహ నిర్మాణాల్లో మిగిలిపోయిన పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.
అంతే గాని ఒకసారి కేటాయించిన గృహాలను తిరిగి మార్చడం గాని ఓట్లు వేస్తే గాని గృహాలు రావని చెప్పడం చాలా దారుణం అన్నారు.
తాము ఎవరినీ ఏమీ అనలేదని వైసీపీ వారే పథకాలు పోతాయని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
పథకాలన్నీ కంప్యూటర్ లో ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటాయని వాటిని రద్దు చేయడం ఎవరి వల్ల కాదని స్పష్టత ఇచ్చారు.
ఒకవేళ జగన్ ఈ పథకాలను నిర్వహించలేక రద్దు చేస్తే ఈ పథకాలు వాటంతట అవే రద్దవుతాయన్నారు.
కానీ మిగిలిన వారు ఎవరు ఈ పథకాలను రద్దు చేసే అధికారం లేదని గుర్తు చేశారు.
మండపేట పురపాలక సంఘంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామన్నారు.
సాధారణంగా కాంట్రాక్టర్లను మార్చడానికి రెండు నెలల సమయం పడుతుందని అందుచేతనే తాను మూడు నెలల వ్యవధి కోరానని చెప్పారు.
టిడ్కో గృహ సముదాయానికి అన్ని వసతులు తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించారు.
130 ట్రాన్స్ ఫార్మర్ లు నిర్మించామని అదేవిధంగా మంచినీటి వసతి డైరెక్ట్ పంపింగ్ సిస్టం ద్వారా అన్ని ప్లాట్లకు మంచినీరు అందించామన్నారు.
వీటికి సంబంధించిన ట్రైల్ రన్స్ కూడా జరిగాయన్నారు.
ఇవేమీ తెలుసుకోకుండా తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి తాను రాజ్యాంగబద్ధంగా వ్యవహరించానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
నిన్న జరిగిన బహిరంగ సభ రాజ్యాంగబద్ధంగా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.
స్థానిక సంస్థలకు అసాధారణమైన అధికారాలు ఉంటాయని ఆ అధికారాలను హరించడం ఎవరి వల్ల కాదని తెలియజెప్పారు.
పురపాలక సంఘం పరిధిలో నిర్మిస్తున్న ఇళ్లకు పురపాలక సంఘానికి అధికారం ఉంటుందని ఈ మేరకు రాజ్యాంగం సవరణలు కూడా చేసిందన్నారు.
మీరు గృహాలు ఎప్పుడు ఇచ్చేది, ఏ సమయంలోగా ఇచ్చేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పలానా తేదీ లోపు వస్తుందని తాము ఖచ్చితంగా చెబుతున్నామని అన్నారు.
తెలుగుదేశం పార్టీని 30 వార్డుల్లో గెలిపించాలని ఆయన కోరారు.
30 వార్డుల్లో నెగ్గిన వెంటనే తాము అనుకున్న ప్రకారం 15 రోజుల్లోపు గృహాలను స్వాధీనం చేయడం జరుగుతుందన్నారు.