ప్రతిరోజు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలి..
మండపేట: కోవిడ్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతిరోజూ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని బిజెపి మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు.
కోన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు అనేక మంది కరోనా రోగులు వస్తూ ఉంటారని వారి కూడా వచ్చే బంధువులకు ఇతరుల వల్ల కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని అందువలన ముందుజాగ్రత్త చర్యగా ప్రతిరోజు ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలని అధికారులను కోరారు.
అలాగే ఎక్కువ జనభా సంచరించే కపిలేశ్వరపురం రోడ్, బస్టాండ్, రైతుజజార్ ఏరియా, రధంసెంటర్ మొదలగు ముఖ్యప్రాంతాలను గుర్తించి ద్రావణాన్ని పిచికారీ చేయించాలని కోరారు.