కడప జిల్లాలో భారీ పేలుడు. పదిమంది దుర్మరణం
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.
పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది.
సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి బయలుదేరారు. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.
