బ్యాక్ డోర్ టీజర్ విడుదల
నిర్మాతలకు రివార్డులు, మాకు మంచి అవార్డులు తెచ్చే చిత్రం “బ్యాక్ డోర్” -చిత్ర కథానాయకి పూర్ణ
ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.
విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన “బ్యాక్ డోర్” టీజర్ చాలా బాగుందని, దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించిందని, ఇప్పటికే నంది అవార్డు గెలుచుకున్న బాలాజీ ‘బ్యాక్ డోర్’తో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని, పూర్ణ కెరీర్ లో మరో మంచి హిట్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అతిధులు ఆకాంక్షించారు.
తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, రష్ చూసి ఇంప్రెస్ అయి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ లతోపాటు… సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన హీరోయిన్ పూర్ణ, హీరో తేజలకు కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు.
తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ ఫిల్మ్ గా “బ్యాక్ డోర్” నిలిచిపోతుందని, దర్శకుడు బాలాజీ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారని హీరోయిన్ పూర్ణ అన్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు, నటనలో తనకు ఎన్నో సూచనలిచ్చిన పూర్ణకు చిత్ర కథానాయకుడు తేజ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత-నిర్మాత కోన వెంకట్, ప్రముఖ దర్శకులు వీర శంకర్, సంతోషం సురేశ్, ప్రముఖ నటులు-నిర్మాత కె.అశోక్ కుమార్, ఈ చిత్ర దర్శకుడు కర్రి బాలాజీతో “ఆనంద భైరవి” నిర్మిస్తున్న బి.తిరుపతిరెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ రఘు, చిత్ర నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి, పొలిటీషియన్ తిరుమలేష్ నాయుడు, సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, కథానాయకుడు తేజ త్రిపురాన, హీరోయిన్ పూర్ణ, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్, మేనేజర్ కళ్యాణ్ సుంకర, ప్రొడక్షన్ డిజైనర్ విజయ తదితరులు పాల్గొన్నారు.