పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు వెంటనే ఇవ్వాలి..
ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు..
మండపేట: మున్సిపాలిటీలో పనిచేయుచున్న పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ లు సరిగా ఇవ్వటంలేదని తన దృష్టికి వచ్చిందని శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
మండపేట పట్టణంలో కరోన మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూ అనేకమంది ప్రాణాలు తీస్తున్న ప్రస్తుత పరిస్ధితులలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు వెంటనే ఇవ్వవలసినదిగా మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాశారు.
వీటికి అయ్యే ఖర్చు అవసరమని భావిస్తే కౌన్సిల్ ముందుకు తీసుకురావలసినదిగా ఎమ్మెల్యే కోరారు.
మ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నందు ఆక్సిజన్ అందుబాటులో లేక పేషెంట్ లు అనేక ఇబ్బందులు పడుచున్నారని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు.
సి.హెచ్.సి ని సంప్రదించగా ఆక్సిజన్ ఫిల్లింగ్ కొరకు 10 సిలిండర్లు పంపామని, ఇంకా రాలేదని వారు తెలిపారని చెప్పారు.
అందువలన వెంటనే మండపేట సి.హెచ్.సి కి ఆక్సిజన్ సిలిండర్లు పంపే ఏర్పాటు చెయ్యవలసినదిగాను, అదేవిధంగా మండపేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు కరోన పేషెంట్స్ కు ఇచ్చే కరోనా మెడికల్ కిట్లు అయిపోయినవని తెలిసిందని, 1000 మెడికల్ కిట్లను పంపించాలని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ని వాట్సప్ మెసేజ్ ద్వారా కోరిమని ఎమ్మెల్యే తెలిపారు.