విశాఖ: విశాఖపట్నంలో టిడిపికి కీలక నేత అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో తమ పార్టీలోకి చేరనున్నట్లు వైయస్ఆర్సీపి ఎంపీ విజయసాయి రేడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ వ్యాఖ్యల్లో ఎటువంటి నిజమూ లేదని, అవి కేవలం పుకార్లేనని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా గంటా చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.
“2019 నుండి ఇప్పటి వరకు సుమారు వందసార్లు నేను పార్టీలు మారుతానని పుకార్లు వచ్చాయి.
పార్టీ మారే ఆలోచన ఉంటే అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటానే తప్ప చీకట్లో రాయబారాలు చేయను.
విజయసాయి రెడ్డి ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదు.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక మైండ్ గేమ్ లాగే అనిపిస్తుంది.
నేను ప్రతిపాదనలు పంపినట్లుగా స్వయంగా విజయసాయిరెడ్డి గారే చెప్పినందున ఎటువంటి ప్రతిపాదనలు పంపానో కూడా వారే సమాధానం చెప్పాలి.
గడిచిన రెండు సంవత్సరాలుగా నా సహ నేత నాకు అత్యంత ఆప్తులలో ఒకరైన కాశీ అనేక రకాలుగా ఇబ్బందులు పడ్దారు, అందుకే ఆయన పార్టీ మాలవలసి వచ్చింది.
కాశీ మాత్రమే కాక, అనేక మంది మా పార్టీ వీడి వెళ్ళిన సందర్భాలు గడచిన రెండేళ్ళలో అనేకం చూశాం, వారందరూ పార్టీ వీడడం చూసి నేను కూడా పార్డీ వీడతాను అనే ఊహలు సమంజసం కాదు.
గడచిన 25 సంవత్సరాలుగా నేను రాజకీయల్లో ఉన్నాను, పార్టీ మారల్సీవస్తే అందరిని సంప్రదించే పార్టీ మారుతాను తప్ప రహస్యంగా మారవలసిన అవసరం లేదు.” అంటూ వియజయసాయి రెడ్డి చేసిన వ్యాఖలను ఖండించారు గంటా శ్రీనివాసరావు.