తూ.గో జిల్లా కాకినాడ… ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
కాకినాడ నుండి విజయవాడ వెళ్తున్న ఏ. సి ఆర్టీసీ బస్సు ఉదయం 7.30 గంటలకు జిల్లా పరిషత్ సెంటర్ కు చేరుకునే సరికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
డ్రైవర్ అప్రమత్తం కావడం తో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.
ప్రమాదం జరిగినపుడు బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణం గా మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా తెలుస్తుంది.
సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసారు.