కాజీపేటలో తెలంగాణ గణపతిగా ప్రసిద్ధి పొందిన శ్వేతార్కగణపతి దేవాలయంలో నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటలకు అఖండ దీపం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.
అఖండ దీపంలో భక్తులచే వేయబడిన ఒత్తులు నూనె అధికం కావడంతో ఒక్కసారిగా దీపము అంటుకొని పెద్ద మంటలు లేచాయి.
అఖండ దీపం చుట్టూ ఉన్న అద్దములు వేడికి పగిలి చెల్లాచెదురుగా పడిపోయాయి.
అక్కడే శివుని వద్ద పూజ చేస్తున్న అర్చకులు, భక్తులు శబ్దం విని దూరంగా జరగడంతో వేడికి పగిలిన అద్దం ముక్కలు ఎవరిమీద పడకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయములు అవలేదు.
ఉవ్వెత్తున మంటలు లేవడంతో అక్కడున్న భక్తులు భయానికి లోనయ్యారు. హుటాహుటిన దేవాలయ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు.
ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కలగలేదని దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ అసిస్టెంట్ మేనేజర్ దుర్గం సుధీర్ ఒక ప్రకటనలో తెలియజేశారు