తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్నాటక మీదుగా మరత్వడా వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు ఇంటీరియర్ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టం నుండి 0.9కి మీ వరకు ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ రోజు (7వ.తేదీ) మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్,కామారెడ్డి, సంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మిగతా జిల్లాలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
