పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి అని కోరుతూ ఎమ్మెల్యే సీతక్క గారికి వినతి పత్రం అందించిన రైతులు
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని కోరుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి రైతులు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, గత 4 రోజులుగా కన్నాయిగూడెం మండలం కేంద్రంలో మండల వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ రైతులను భయాబ్రంతులకు గురి చేస్తున్నారని నిన్నటికి నిన్న బుట్టాయిగూడెం, సర్వాయి, గ్రామాలలో అదే విధంగా ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడులు చేస్తూ భూముల చుట్టూ స్ట్రెంచ్ లు కొడుతున్నారని ఫారెస్ట్ అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
2014 ఎన్నికల సమయములో పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 7 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పొగ హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో తాను పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టేందుకు ముఖ్య మంత్రితో మాట్లాడుతానని చెప్పి ఇప్పటి వరకు దాడుల పై స్పందించక పోవడం బాధాకరం అని అన్నారు.
పోడు భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కొట్టుతుండగా రైతులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని లేని యెడల పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత 30 యేండ్ల నుండి సాగు చేసుకున్న భూముల చుట్టూ ఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో స్ట్రెంచ్ కొడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి,
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్,
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,
మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,
జిల్లా కార్యదర్శి ఎండీ ఆ జ్జు
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బద్రూ నాయక్,
దేవ్ సింగ్, తోట ప్రవీణ్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ఛక్రపు రాజు, మేడం రమణ కర్,
కాన్నాయి గూడెం మండల రైతులు మరియు వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాడి రాంబాబు, కిశాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటి రాజబాబు, sc సెల్ మండల అధ్యక్షులు సునరకాని రాంబాబు, బీసీ సెల్ అధ్యక్షులు కటకం మల్లన్న, తదితరులు పాల్గొన్నారు