గుంటూరు జిల్లా .. మంగళగిరి మండలం …ఎర్రబాలెం గ్రామంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడులు నిర్వహించారు.
మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని ఒక కేంద్రంలో కల్తీ నెయ్యి తయారీ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో విజిలన్స్ మరియు ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో సుధీర్ ఇండస్ట్రీస్ పేరుతో బలబధ్ర సుధీర్ అనే వ్యక్తి ‘గో అమృత్ ఘీ’ పేరుతో కల్తీ నెయ్యిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.
డాల్డా, పామాయిల్ ఉపయోగించి వాటితో నెయ్యిని కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దాడిలో కల్తీ చేయుటకు ఉపయోగిస్తున్న 20 డబ్బాల లోని 200 Kgs. డాల్డాను మరియు 63 డబ్బాల లోని 945 Kgs. పామోలిన్ నూనెను అధికారులు స్వాధీనపరచుకున్నారు.
గుంటూరు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఎస్.పి జాషువా నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ఆహార రక్షణ (Food Safety) మరియు తూనికలు కొలతలు (Weights & Measures) శాఖల అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.