జగన్ సీఎం అయిన రెండు సంవత్సరాల్లో అన్ని వర్గాల వారిని మాయమాటలు చెప్పి మోసం చేశారు.
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న.
అధికారంలో వచ్చిన వెంటనే పి.ఆర్.సి. అమలు చేస్తానని మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చా ఆ మాటే మర్చిపోయి ఉద్యోగస్తులందరినీ మోసంచేశారు.
గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా 6 డీఏలు పెండింగులో పెట్టిన వైనాన్ని ఉద్యోగులు గమనించాలని కోరారు.
ఉద్యోగస్తుల ఒత్తిడికి తలొగ్గి 1 డీఏ ను మూడు దఫాలుగా చెల్లించడమే గాక, కేంద్రాన్ని అనుసరిస్తూ రాబోయో 3 డీఏల రద్దుకు ఉపక్రమించడం తప్పు కాదా అని ప్రశ్నించిన అయ్యన్న.
రాష్ట్ర ఉద్యోగుల డీఏ నిలివేయడమే కాకుండా టీచర్ల సీపీఎస్ రద్దు కూడా కేవలం మాటలకే పరిమితం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పింఛన్లు మంజూరు చేయడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
ఎన్నికలు ముందు హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాపై అధికారంలోకి వచ్చాక ఎందుకు మోడీపై ఒత్తిడి చేయడంలో జగన్ విఫలం అయ్యారు అంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి అయ్యన్న.