సర్వజన ఆస్పత్రి విద్యుత్ వ్యవస్థ తనిఖీ
శ్రీకాకుళం, ఏప్రిల్ 8 : శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో విద్యుత్ వ్యవస్థను తనిఖీ బృందం శనివారం పరిశీలించింది.
విజయనగరం డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టి.అజయ్ బాబు నేతృత్వంలోని బృందం ఆస్పత్రిలో ఎలక్ట్రికల్ పవర్ రూమ్, సబ్ రూమ్ డిపి యూనిట్ తదితర విద్యుత్ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంతో పాటు ఫైర్ యాక్సిడెంట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాల మేరకు, జిల్లా అగ్నిమాపక అధికారి సూచనల మేరకు పరిశీలన చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఏ.కృష్ణమూర్తి, సిఎస్ ఆర్.ఎమ్.ఓ డాక్టర్ ఆర్.అరవింద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్ నాయక్, ఎలక్ట్రికల్ ఫైర్ సేఫ్టీ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.