విజయనగరం జిల్లా మెంటాడ మండలం ప్రపంచ నీటి దినోత్సవం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రమణ మూర్తి మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా భవిష్యత్తులో నీటి కొరత లేకుండా నీటిని ఆదా చేయాలని అన్నారు.
జగనన్న ప్రవేశపెట్టిన జలకళ కార్యక్రమం అందరూ కృషితో విజయవంతం అవడం కోసం కృషి చేయాలని అన్నారు.
రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు బృహత్తర ప్రణాళికతో జలకళ ప్రారంభించబడింది అని ప్రతి గ్రామంలో ఉచితంగా రైతులకు బోర్లను వేసే కార్యక్రమం చేపడుతున్నామని అందరూ రైతులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి, మండల పంచాయతీ విస్తీర్ణ అధికారి వాణిశ్రీ, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, క్షేత్ర సాంకేత సహాయకులు, సచివాలయ సిబ్బంది, ఏ పీ ఓ, ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.