సింహగిరిపై వైభవంగా ధన్వంతరి హోమం
ప్రజారోగ్యం కోసం సింహగిరిపై వైభవంగా ధన్వంతరి హోమం
స్వాతి నక్షత్ర హోమం పూజలు.. సుదర్శన మంత్ర పఠనం
కరోనా నుంచి ప్రజలను కాపాడాలని స్వామికి పూజలు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు., తెల్ల వారు జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన గావించారు.
గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం గావించారు.. అనంతరం ఆలయం పక్కనే ఉన్న యాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలు.. ఆ తర్వాత ధన్వంతరి హోమం, సుదర్శన యాగం నిర్వహించారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని. ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ ధన్వoతరీ హోమం నిర్వహించినట్లు ధర్మకర్త సంచయిత గజపతి, ఆలయ ఈఓ సూర్యకళగారు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా భయం వెంటాడుతుంది అని, ఇటువంటి సమయంలో ధన్వంతరి హోమం నిర్వహించినట్టు అయితే అటువంటి భయాల తోపాటు వ్యాధులు రుగ్మతలు కూడా పూర్తిగా తొలగి పోతాయని భావించి ఈ హోమం నిర్వహించామని స్థానాచార్యులు రాజగోపాల్ చెప్పారు.
గతంలో కంచితో పాటు అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు సంభవించినప్పుడు ఈ తరహాలోనే అక్కడ ధన్వoతరీ హోమంతో పాటు అష్టకమ్ పఠనం చెయ్యడంతో ఆ ప్రాంతంలో వ్యాధులు, జబ్బులు, భయాలు పూర్తిగా మటుమాయం అయ్యాయన్నారు.
దీంతో సింహాచలంలో కూడా ఆలయ చైర్పర్సన్ సంచియిత గజపతిరాజు సూచనలు మేరకు ఈ ధన్వంతరి హోమం నిర్వహించామన్నారు.
దేవ వైద్యులైన ధన్వంతుడ్ని పూజిస్తే సర్వ రోగాలు హరించుకు పోతాయని, త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారు అని రాజగోపాల్ వివరించారు.
ఈ హోమంలో ధర్మకర్త సంచయిత గజపతి, ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమచార్యులు, పురోహితులు కరి సీతా రామా చార్యులు, రాజీవ్ లోచనతో పాటు పలువురు అర్చకులు, వైదిక వర్గాలు పాల్గొన్నాయి.
హోమం అనంతరం ఆలయ బేడా మండపంలో పూజలు జరిపిన కలిసతో ప్రదక్షిణలు నిర్వహించి, స్వామికి చూపించారు. వేద మంత్రాలూ, మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిపించారు.