ప్రశాంత వాతావరణంలో కార్పొరేషన్ /నగర పంచాయతీ/మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు సిబ్బందికి, అధికారులకు మరియు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు: రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ IPS.
ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క పోలీస్ విధి నిర్వహణలో కనపరిచిన తీరు, సేవాతత్పరత, సమయస్ఫూర్తి, ముందస్తు చర్యలు, అన్ని శాఖలతో సమన్వయం, ఇవన్నీ కలిపి ఎన్నికలు సజావుగా నిర్వర్తించడానికి దోహద పడ్డాయి.
అనుక్షణం అప్రమత్తతో సత్వర స్పందనతో చెదురు మదురు సంఘటనలు మినహా ప్రజలందరూ ఉత్సాహంగా, స్వేచ్ఛగా అధికశాతంలో వారి ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకొన్నారు. అందుకు నిదర్శనం పెరిగిన పోలింగ్ శాతం.
ఎన్నికలలో ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఘర్షణ వాతావరణం ఉంటుందేమో అన్న బావన, భయాందోళన వివిధ అపోహలు ప్రజలలో ఉన్నపటికీ వాటన్నింటిని అధిగమించి ప్రశాంతంగా నిర్వహించాం.
శాంతియుతంగా కార్పొరేషన్/ నగర పంచాయతీ/మున్సిపల్ ఎన్నికలను నిర్వహించుకోవడం రాష్ట్ర పోలీసు శాఖ యొక్క అద్భుతమైన పనితీరుకు నిదర్శనం – డీజీపీ.
ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పారదర్శకమైన విధులు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించి వారికి దైర్యన్ని, నమ్మకాన్ని, భరోసాను అందించి వారి మన్ననలను పొందారు.
ఎన్నికల నిర్వహణకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించారు.
శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తూనే, నడవలేని స్థితిలో ఉన్న, అచేతనంగా ఉన్న, వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి, సొంత బంధువులా, కుటుంబ సభ్యునిలా సహకరించారు.
పోలీస్ శాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పారదర్శకమైన, నిజాయితీ, నిస్వార్థంతో కూడిన సేవలను అందించిన పోలీస్ సిబ్బందిని అభినందించడం గర్వంగా ఉందన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది చేసిన సేవలు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకునేలా చేసాయి.
ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ విధివిధానాలకు, ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బందిలో మార్పు పరివర్తనలతో సేవా దృక్పథం వెల్లివిరిసింది.
గతంలో జరిగిన కార్పొరేషన్/ నగర పంచాయతీ/మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలుతో పోల్చుకుంటే ఈ సారి అత్యంత స్వల్ప ఘర్షణలు మాత్రమే జరిగాయి.
నేర ప్రవృత్తి కలిగిన వారిని ముందస్తు బైండోవర్ చేయడం, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బు, మద్యo పంపిణీ జరగకుండా పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టడం, ఇవన్నీ కలిపి విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు సాధ్యపడింది.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు తమ సేవల ద్వారా ప్రజల మన్ననలను పొందారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా SEC సూచనల మేరకు వివిధ శాఖల సహాయ సహకారం, సమన్వయంతో విజయంతంగా పోలీస్ శాఖ 2021 కార్పొరేషన్/ నగర పంచాయతీ/మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. అందుకు అన్ని శాఖలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అంటూ డిజిపి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.