ఆంధ్ర ప్రదేశ్లో అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 13.5 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మొత్తంలో రూ. 5 కోట్ల ఖర్చుతో గ్రానైట్ రాయితో ప్రధాన ఆలయ ప్రాకరం పునర్మాణ పనులు చేపట్టేందుకు కేటాయించనున్నారు.
తెప్పోత్సవం ఘనంగా నిర్వహించేందుకు వీలుగా మరో రూ. 3.5 కోట్ల ఖర్చుతో ఆలయం వద్ద 4 ఎకరాల విస్థీర్ణంలో కోనేరును అభివృద్ధి చేయనున్నారు.
అంతేగాక రూ. 5 కోట్లతో 20 ఎకరాల ప్రాంతంలో మెరక తోలడం తదితర పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఎంతో పురాతనమైన ఈ ఆలయ నిర్మాణం ఇసుకరాతితో జరగడం వలన కాలక్రమంలో అరుగుదలకు గురవగా దానిని ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా గ్రనైట్ రాతితో పునర్మించనున్నారు.
సాధారణ రోజుల్లో దాదపు 500 భక్తులు వరకు వచ్చే ఈ ఆలయానికి వస్తుంటారు, అయితే పర్వదినాల్లో 5000 మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు.
అటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్న 30 వసతి గదులు వచ్చే భక్త జనానికి సరిపోవడకపోవడంతో దాదాపు 34.6 ఎకరాల విస్థీర్ణంలో గల ఆలయ భూముల్లో భక్తుల అవశరాలు తీర్చే విధంగా అదనపు గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలియజేశారు.