ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ యూనిట్ల తయారీలో ముందడుగు
ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ యూనిట్ ఉత్పత్తిని పెంచేందుకు CSIR-CMERI సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలకు బదిలీ చేస్తూ మరో ముందడుగు వేసింది.
దుర్గాపూర్ లోని CSIR-CMERI ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ యూనిట్ యొక్క సాంకేతికతను ఈ రోజు CSIR-CMERI డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ సమక్షంలో రాజ్‌కోట్ లోని M / s జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్, మరియు గురుగ్రామ్ లోని M / s గ్రిడ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హిరానీ మాట్లాడుతూ, ప్రస్తుత COVID-19 మహమ్మారి పరిస్థితిల్లో ఆక్సిజన్ యొక్క మెరుగైన పంపిణీ వ్యూహాల అవసరాన్ని గురించి ప్రస్తావించారు.
సగటున, ఒక వ్యక్తికి తగిన ఆక్సిజన్ కలిగిన 5-20 LPM గాలి అవసరం అని ఆయన తెలిపారు.
CSIR-CMERI చే అభివృద్ధి చేయబడిన సాంకేతికత ఆక్సిజన్ కొరతను నివారించడం సహాయపడటమే గాక, దాని సరఫరా కోసం ఇతర శక్తులపై ఆధారపడవలసిన అవసరాన్ని నివారిస్తుంది.
అంతేగాక భారీ ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించడం అందులో ఉన్న నష్టాలను మరియు కష్టాలను తొలగిస్తుంది.
CSIR-CMERI అభివృద్ధి చేసిన OEU రోగులు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎమ్.ఆర్.ఐ OEUల ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు సేవలకు సంబంధించిన లైసెన్స్‌ను నాలుగు పరిశ్రమలకు బదిలీ చేసిందని.
ఈ నాలుగు సంస్థలు మే 2 వ వారం నాటికి ఉత్పత్తిని తయారు చేయగలవని ఆయన నమ్మకంగా ఉన్నారని ప్రొఫెసర్ హిరానీ పేర్కొన్నారు.
గ్రిడ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడనున్నదని దీనిని అభివృద్ధి చేసిన CSIR-CMERI బృందాన్ని ప్రశంసించారు.
చైనా మరియు యుఎస్ఎ నుండి అవసరమైన కంప్రెసర్లను దిగుమతి చేసుకోవడంలో కొన్ని అడ్డంకులను అధిగమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రారంభంలో తన కంపెనీ రోజుకు 25 నుండి 50 యునిట్ల తయారీని ప్రారంభించి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.
CSIR-CMERI కొన్ని అహ్మదాబాద్ ఆధారిత సంస్థల నుండి కూడా మూలాలను అన్వేషించాలని సూచించింది.
మార్కట్ అంచనాలకు అణుగుణంగా తమ సంస్థ అందించే యునిట్లను రూపోందిస్తామని, అవసరమైన డిజిటల్ సాంకేతికతపై కూడా పరిశోధనలు జరుపుతామని మిస్టర్ గుప్తా అన్నారు.
తాము ఈ విషయాన్ని వాణిజ్య కోణం నుండి మాత్రమే కాకుండా సమాజానికి చేసే సేవగా కూడా చూస్తున్నామని గుప్తా అన్నారు.
ఈ సందర్భంగా, జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఒక వారంలోనే తమ నమూనాను తయారు చేస్తామని అన్నారు.
అంతేగాక వారు తమ స్వంత కంప్రెసర్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున డిమాండ్ ప్రకారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తామని ధృవీకరించారు.
ప్రస్తుతం అవసరం చాలా ఎక్కువగా ఉన్నందున, వారు రోజుకు 1000 కి పైగా యూనిట్లను తయారు చేయడానికి ప్రయత్నిస్తామని, సుందరీకరణ, పోర్టబిలిటీ మరియు వ్యయ అంశాలను పరిగణనలోకి తీసుకొని మెటల్ షీట్ బాడీని ప్లాస్టిక్ బాడీగా మార్చాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులలో డిమాండును అందకోవడానికి, వారు యూనిట్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు 24×7 పని చేస్తున్నామని, తద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించినట్లు భావిస్తామని అన్నారు.