శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7రోడ్డు కూడలికి మోటారు సైకిల్ పై వెళ్తూ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో మోటారుసైల్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో జవాను తలకు తీవ్ర గాయం తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతునికి గత ఏడాదే వివాహం జరిగింది. ఈ ఘటనపై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.