మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొంబాయి కుంట చెరువులో గత సంవత్సర కాలంగా మత్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతబట్టుకుని బిక్కు బిక్కుమంటూ వెళ్ళవలసి వచ్చింది.
ఎన్నో ఏళ్ళుగా తమ జీవనాధారంగా ఉన్న చేపల వేటను ప్రాణాపాయంగా మార్చింది ఆ చెరువులో చేరిన మొసలి.
సంవత్సరం క్రితం అకస్మాత్తుగా చెరువులో ఈ మొసలి ప్రత్యక్షమయినప్పటి నుండి మత్సకారులు చేపల వేటకు వెళ్ళాలంటేనే భయబ్రాంతులకు లోనయేవారు.
అయితే మత్స్యకారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ మొసలిని ఎట్టకేలకు బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన గూడూరు ముదిరాజులు.
ఇన్ని రోజులుగా తమ జీవనాధారాన్ని దెబ్బతీసిన ఆ మొసలి పట్టుబడడంతో మత్స్యకారలు సంతోషాన్ని వెళ్లబుచ్చారు.