కోవిడ్ సమీక్షా సమావేశం నిర్వహించిన విశాఖ జిల్లా కలెక్టర్
ఈ రోజు విశాఖపట్నం జిల్లా వుడా చిల్డ్రన్ థియేటర్లో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారి అధ్యక్షతన ప్రస్తుత నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు కురసాల కన్నబాబు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా రవాణా వాహనాలలో కరోనా వ్యాప్తి అరికట్టడం కొరకు మన ఆరోగ్యం మన భద్రత కరపత్రాలను ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి పాడేరు ఎమ్మెల్యే శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి,ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
