కరోనా వ్యాక్సిన్ ప్రతి ఇంటికి అందించాలి– కోన సత్యనారాయణ..
మండపేట: రాష్త్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్లు, ఆశావర్కర్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ ప్రతి ఇంటికి పంపిణీ చేసి కరోనా వ్యాప్తిని అరికట్టాలని కోన సత్యనారాయణ పేర్కొన్నారు.
మండపేట పట్టణంలో ఉన్న 30వ వార్డులో కరోనా బారిన పడిన వారు అధికంగానే ఉన్నారని కొందరు ధైర్యంగాను, మరికొంతమంది చెప్పడానికి భయపడి బయట విచ్చలవిడిగా తిరుగుతూ వ్యాధి వ్యాప్తి చేస్తున్నారన్నారు.
దీనిపై పోరాడాల్సిన భాద్యత ఆరోగ్యశాఖకు ఉందని దానికి తగినవిధంగా సిబ్బందిని నియమించి వ్యాక్సినేషన్ ను తొందరగా అందరికీ అందేలా చేయాలని అన్నారు.
ప్రస్తుతం కొద్దిపాటి కేంద్రాలే ఉన్నరీత్యా ఈవ్యాధి మరింత జఠిలమయ్యే ప్రమాదముందని, అందువలన వాలంటర్, అంగన్వాడీ, ఆశవర్కర్లు, ఆరోగ్య సిబ్బంది సహాయంతో వ్యాక్సిన్ అందేలా చూడాలని కోరారు.